● వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికేబుల్ డిసీస్) ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆయా పీహెచ్‌సీల నుంచి వచ్చే బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈసీజీ, టుడిఇకో తదితర పరీక్షలు చేయించాలని సూచించారు. ఇందుకోసం ఓ వైద్యుడితో పాటు సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. పీహెచ్‌సీ వైద్యులు అసంక్రమిత వ్యాధులకు సంబంధించి పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఎన్‌సీడీ ప్రోగ్రామ్ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment