ఆదివాసీ హక్కుల కోసం నిరంతర పోరాటం
నార్నూర్: ఆదివాసీ హక్కుల కోసం తుడుందెబ్బ నిరంతర పోరాటాలు చేస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు పెందూర్ దాదిరావు అన్నారు. మండల కేంద్రంలోని కుమురంభీం భవన్లో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనను ఆదివాసీ సంక్షేమ పరిషత్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జల్ జంగల్ జమీ న్ నినాదంతో నాడు ఆదివాసీ బిడ్డ కుమురంభీం పోరాటం చేశారని, అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడు తూ జాతి సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నా రు. ఇందులో జిల్లా ఉపాధ్యక్షుడు మేస్రం మాణిక్యరావు, డివిజన్ అధ్యక్షుడు కనక ప్ర భాకర్, మండలఅధ్యక్షుడు శ్రీరామ్, ఈస్రు, మాన్కు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment