కలెక్టర్‌కు శుభాకాంక్షల వెల్లువ
కైలాస్‌నగర్:నూతన సంవత్సరం పురస్కరించుకుని పలువురు జిల్లాస్థాయి అధికారులు, వివిధ రాజకీ య పార్టీల నాయకులు, కుల,ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ రాజర్షి షాను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆయా సంఘాల ప్రతిని ధులు,అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు, బ్లాం కెట్లు, నోట్‌బుక్‌లు, డిక్షనరీలు, పెన్నులు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదన పు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవియా, జెడ్పీ సీఈవో జి.జితేందర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేశ్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ జేఆర్ చౌ హాన్, డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు, ఆర్‌అండ్‌బీ ఈఈ నర్సయ్య, కలెక్టరేట్ ఉద్యోగులు, టీఎన్జీవోస్, టీజీ వోస్ సంఘాల నాయకులు, తదితరులు కలెక్టర్‌ను కలిశారు. కాగా రెవెన్యూ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసిన కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన డైరీ, క్యాలెండర్లను సంఘం ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment