ఆదిలాబాద్‌టౌన్: సమగ్ర ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశా రు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యా ఖ్యలు చేశారని, అలాగే హైదరాబాద్‌కు చెందిన ఓ ఉద్యోగిపై అసభ్యకర కామెంట్ చేయడంతో రాచకొండ కమిషనరేట్ పరిధిలో గల మీర్‌పేట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈమేరకు అక్కడి పోలీసులు సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. మావల మండల కేంద్రంలోని న్యూ హౌసింగ్‌బోర్డులో నివాసం ఉంటున్న ఆయనను విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, మావల ఎస్సై విష్ణువర్ధన్‌ను అడగగా విచారణ నిమిత్తం తీసుకెళ్తున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆయనను అరెస్టు చేసి తీసుకెళ్లడంతో కుటుంబీకులతో పాటు సమగ్ర ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment