కష్టపడే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు
● ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ● ఇంద్రవెల్లి ఏఎంసీ పాలకవర్గ ప్రమాణస్వీకారం
ఇంద్రవెల్లి: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతీ కా ర్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ఏఎంసీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్ ఆధ్వర్యంలో చైర్మన్ ముఖడే ఉత్తం, వైస్‌చైర్మన్ సోయం మారుతితో పాటు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే సనాన్మించి మాట్లాడారు. పదవులు రాని వారు నిరాశ చెందవద్దని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి లబ్ధిదా రులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తహపీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీవో భాస్కర్, మార్కెట్ కార్యదర్శి దేవన్న, పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment