కై లాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హమాలీలు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరింది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ మాట్లాడుతూ, పెంచిన కూలి రేట్ల జీవో జారీ చేయాలనే డిమాండ్‌తో సివిల్ సప్లయ్ హమాలీలు ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే స్పందించి కూలి రేట్ల పెంపు జీవో జారీ చేయాలని, ఆరోగ్యబీమా కింద రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సివిల్ సప్‌లై కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘ నాయకులు రమేశ్, సలీం, పొచ్చన్న, రాజేందర్, లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment