‘ముక్కోటి’ పూజలు
శ్రీవిష్ణు నామస్మరణతో భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం వేకువజాము నుంచే ఆలయాలకు తరలివచ్చారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని కనులారా వీక్షించేందుకు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం(మార్వాడి ధర్మశాల), మంగమఠాల్లో భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్వాడి ధర్మశాలలో మాజీ మంత్రి జోగు రామన్న స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆయన వెంట సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి తదితరులు పాల్గొన్నారు. – ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment