ప్చ్.. మరో రూ.50 కోత
● నాణ్యత పేరిట రెండోసారి పత్తి ధర తగ్గించిన సీసీఐ ● ఇప్పటికే గత నెలలో రూ.50 కోత ● తాజా నిర్ణయంతో రూ.100 తగ్గనున్న ‘మద్దతు’ ధర ● ఈనెల 16 నుంచి అమలుకు నిర్ణయం ● ఆందోళనలో రైతులు
ఆదిలాబాద్‌టౌన్: పత్తిలో నాణ్యత తగ్గిందని మరో సారి ధరలో కోత విధించేందుకు సీసీఐ రంగం సి ద్ధం చేసింది. గత నెల 31 నుంచి క్వింటాలుకు రూ. 50 తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీసీఐ రూ.7,471తో కొనుగోలు చేస్తుండగా, ఈనెల 16 నుంచి మరో రూ.50 తగ్గించేలా నిర్ణయం తీసుకుంది. దీంతో మద్దతు ధరలో రూ.100 కోత విధించినట్లయింది. ఈ నిర్ణయంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. అసలే పత్తికి గిట్టుబాటు ధర లేదని ఆవేదనలో ఉండగా, ప్రభుత్వరంగ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయం వారిని మరింత కుంగదీయనుంది. నాణ్యతలో ప్రమాణాలు తగ్గాయని బీబీ స్పెషల్ నుంచి మెక్‌మోడ్‌కు మారిందని సీసీఐ అధికారులు చెబుతున్నారు. పత్తి క్వింటాలు మద్ద తు ధర రూ.7,521 ఉండగా, 15 రోజుల్లోనే రూ. వంద తగ్గించారు. ధర పెరుగుతుందని ఆశతో నిల్వ ఉంచుకున్న రైతుల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది.
21.68లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు..
జిల్లాలో ఐదు మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 21లక్షల 68వేల 78 క్వింటాళ్ల పత్తి ని కొనుగోలు చేశారు. ఇందులో ప్రైవేట్ వ్యాపారులు లక్ష 51వేల 478 క్వింటాళ్లను కొనుగోలు చేయగా, సీసీఐ 20 లక్షల 16వేల 599 క్వింటాళ్ల కొనుగోలు చేసింది. అయితే ఆదిలాబాద్‌లో అత్యధికంగా 11లక్షల 80వేల 496 క్వింటాళ్లు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment