సాధారణంగా హైదరాబాద్ జేబీఎస్ నుంచి ఆదిలాబాద్‌కు సూపర్ లగ్జరీ రెగ్యులర్ సర్వీసులో రిజర్వేషన్ చేసుకుంటే రూ.610 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో బేసిక్ చార్జీ రూ.481, మిగతావి టోల్‌ప్లాజ్, రిజర్వేషన్ తదితర చార్జీలు ఉంటాయి. ప్రస్తుతం ప్రత్యేక బస్సుల్లో బేసిక్ చార్జీపై 50శాతం పెంపు అంటే రూ.240.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర చార్జీలతో కలిపి ఈ మొత్తం రూ.850 వరకు చేరింది. పండుగ సమయాల్లో అదనపు బస్సులు కేటాయించి మెరుగైన రవాణా సౌకర్యం అందించాల్సిన ఆర్టీసీ.. ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరిగా రేట్లు పెంచడం సమంజసం కాదని ప్రయాణికుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment