‘మద్దతు’లో కోత సరికాదు
నేను ఎనిమిదెకరాల్లో పత్తి సాగు చేసిన. 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఇందులో 20 క్వింటాళ్ల వరకు ఇంట్లో నిల్వ ఉంది. ధర పెరుగుతుందనే ఆశతో నిల్వ ఉంచితే మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తుంది. పదిహేను రోజుల క్రితం క్వింటాలు కు రూ.50 కోత విధించిన సీసీఐ ఇప్పుడు మరో రూ.50 కోత పెట్టడం సరికాదు. పత్తి సాగుకు పెట్టుబడి పెరుగుతుంది. ఈ ధరతో గిట్టుబాటు కావడం లేదు. మరింతగా ధర తగ్గిస్తే నష్టపోతాం. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలి.
– మరప ప్రవీణ్, రైతు, గోవింద్‌పూర్,
భీంపూర్ మండలం
Comments
Please login to add a commentAdd a comment