జాబితాలో మా పేరేది?
● అర్హులైన పలువురిలో ఆందోళన
ఇక్కడ కనిపిస్తున్నది లడేవార్ సంజీవ్. బోథ్ మండలంలోని మర్లపెల్లి గ్రా మం. ఐదేళ్ల క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చే సుకున్నాడు. ఇటీవల ప్రజాపాలనలోనూ మరోసారి దరఖాస్తు అందజేశాడు. అయితే కార్డు మంజూరు లిస్టులో ఈయ న పేరు లేదు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అ ర్హుడైనా జాబితాలో పేరు లేకపోవడంపై ఆందో ళన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. ఇతనొక్క డే కాదు..జిల్లాలో చాలా మంది అర్హులైన తమ పేరు జాబితాలో గల్లైంతందని పేర్కొంటున్నారు.
బోథ్: ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల మంజూరు కు శ్రీకారం చుట్టింది. అయితే అన్ని అర్హతలున్నా తమ పేర్లు మాత్రం జాబితాలో కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. తాము నిరుపేదలమని, ఏళ్లుగా కార్డు కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న సర్వేలోనైనా తమ పేర్లు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతున్నారు.
మార్పులు చేర్పులకు నో..!
అలాగే గతంలో రేషన్‌కార్డులు ఉన్న వారు తర్వాత జన్మించిన తమ కుమారులు, కుమార్తెల పేర్లు నమోదు చేసుకోవాలని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ప్రస్తుత సర్వేలో అవకాశం ఇవ్వలేదు.
360 డిగ్రీ సాఫ్ట్‌వేర్‌తో లబ్ధిదారుల ఎంపిక..
ఈసారి ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు 360 డిగ్రీ సాఫ్ట్‌వేర్ సాంకేతికను వినియోగిస్తుంది. అ యితే గతంలో తమ కుటుంబ రేషన్ కార్డులో పే రు ఉండి, పెళ్‌లైన తరువాత కొత్త కార్డుకు దరఖా స్తు చేసుకున్న వారిని ఈ సాఫ్ట్‌వేర్ ఎంపిక చేయ డం లేదు. దీంతో చాలా వరకు కొత్త జంటలకు జాబితాలో చోటు దక్కలేదని తెలుస్తోంది. మరో వైపు ఒకే ఇంటి నంబర్‌పై రెండుకు మించి కు టుంబాలు ఉంటే అందులో కూడా చాలా మంది కి జాబితాలో చోటు దక్కలేదని పలువురు పే ర్కొంటున్నారు. అర్హత ఉన్నా, తమ పేరు లేకపోవడంపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment