‘మెస్రం’ పాదయాత్రకు విరామం
ఇంద్రవెల్లి: ఈ నెల 28న నాగోబా ఆలయంలో చేపట్టనున్న మహాపూజకు అవసరమయ్యే గంగాజలంను పాదయాత్ర ద్వారా సేకరించిన మెస్రం వంశీ యులు ఆదివారం రాత్రి మండలంలోని దొడందా కు చేరుకున్న విషయం విదితమే. గ్రామ పొలిమేరలో ఉన్న చెట్టుపై గంగాజలాన్ని భద్రపరిచారు. అనంతరం పాదయాత్రకు విరామం ఇచ్చి సోమవారం ఉదయం తమ తమ గ్రామాలకు వెళ్లిపోయారు. ఈ నెల 24న మళ్లీ ఇక్కడికి చేరుకుంటారు. భద్రపరిచిన గంగాజలంతో తిరిగి పాదయాత్రగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి కేస్లాపూర్ సమీపంలో గల మర్రిచెట్టు వద్దకు చేరుకుని బస చేస్తారు. అక్కడే మూడు రోజుల పాటు తూమ్ పూజలు నిర్వహించనున్నట్లు మెస్రం వంశపెద్దలు తెలిపారు. 28న నాగోబా ఆలయానికి చేరుకుని పవిత్ర గంగాజలంతో నాగోబాను శుద్ధి చేసి జాతర ప్రారంభించనున్నట్లు ఆలయ పీఠాధిపతి వెంకట్‌రావ్ పేర్కొన్నారు.
ఆచారం ప్రకారం గ్రామాలకు వెళ్లిన వంశీయులు
Comments
Please login to add a commentAdd a comment