‘రేషన్’లో మార్పులకు అవకాశం
● ఏళ్ల నిరీక్షణకు తెర ● తీరనున్న కార్డుదారుల తిప్పలు
కైలాస్‌నగర్: ఆహారభద్రత కార్డుల్లో సభ్యుల మా ర్పులు, చేర్పుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డుల జారీతో పాటు స భ్యుల పేర్లను కూడా చేర్చేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 34,451మంది వివరాలతో కూ డిన జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి పంపించింది. ఆయా పంచాయతీలు, వార్డుల వారీగా సిద్ధం చేసిన అధికారులు ఆ జాబితాలను పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లకు అందజేశారు. వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అర్హులైన వారి సమాచారం సేకరిస్తున్నారు. లబ్ధిదారులను గుర్తించి మంగళవారం నుంచి నిర్వహించే గ్రామసభల్లో వారి వివరాలు వెల్లడించనున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా కార్డుల్లో కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లు నమోదు కానున్నాయి. తద్వారా రేషన్ సరుకులు పొందే అవకాశం కలగనుంది.
ఏళ్లుగా ఎదురుచూపులు..
పెళ్లి అయి కొత్తగా అత్తవారింటికి వచ్చిన మహిళలు, పుట్టిన పిల్లల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చేందు కోసం ఇప్పటికే చాలా మంది మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చివరగా 2021లో రేషన్‌కార్డుల ను జారీ చేసింది. అయితే కొత్తగా కుటుంబంలో ని సభ్యుల పేర్ల చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించలేదు. దీంతో చాలా మంది ఏళ్లుగా నిరీక్షి ంచారు. పుట్టిన పిల్లలు బడికి వెళ్లే వయస్సు వచ్చి నా వారి పేర్లు రేషన్ కార్డుల్లో నమోదు కాలేదు. దీంతో ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌తో పాటు మండలస్థాయిలో అధికారులను కలుస్తూ చాలామంది అర్జీలు అందించారు. ఏళ్లుగా ఎదురుచూశారు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి నిరీక్షణకు తెర దించింది. గతంలో దరఖాస్తు చే సుకున్న వారందరి పేర్లను కార్డుల్లో చేర్చేలా ఆదేశాలిస్తూ వారి వివరాలను జిల్లాకు పంపించింది. వాటి ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, వా ర్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ఇంటింటికితిరుగుతూ సమాచారం సేకరిస్తున్నారు. నేటినుంచి 24 వర కు జరిగే గ్రామసభల్లో అర్హుల వివరాలు వెల్లడించి కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయనున్నారు.
మండలం అందిన
దరఖాస్తులు
ఆదిలాబాద్ అర్బన్ 5,818
ఆదిలాబాద్‌రూరల్ 2,512
నార్నూర్ 1,306
గాదిగూడ 1,589
మావల 2,062
గుడిహత్నూర్ 1,810
తలమడుగు 1,518
తాంసి 751
బేల 1,988
నేరడిగొండ 781
బజార్‌హత్నూర్ 1,307
బోథ్ 2,802
ఇచ్చోడ 2,023
సిరికొండ 532
ఇంద్రవెల్లి 2,184
ఉట్నూర్ 2,105
భీంపూర్ 1,089
జైనథ్ 2,274
గ్రామసభల్లో అర్హుల ఎంపిక..
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకాశం కల్పించింది. ప్రభుత్వం నుంచి అందిన జాబితా ప్రకారం క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలన చేస్తున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి గ్రామసభల్లో ఆ వివరాలను ప్రదర్శిస్తారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన వారుంటే గ్రామసభల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే మార్పులు, చేర్పులకు సంబంధించిన అప్లికేషన్లు కూడా
స్వీకరిస్తారు. –వాజిద్ అలీ, డీఎస్‌వో
Comments
Please login to add a commentAdd a comment