ఆదిలాబాద్: ఆటోడ్రైవర్లు రోడ్డు భద్రత ని యమాలు పాటించాలని ఏఎంవీఐ ఫహి మా సుల్తానా అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో ఆటోడ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై సోమవారం అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రత్యూష, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యుడిగా రామన్న
కై లాస్‌నగర్: రైతు ఆత్మహత్యలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలో మాజీ మంత్రి జోగు రామన్నకు చోటు కల్పించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తొమ్మిది మందితో నియమించిన కమిటీలో రామన్న సభ్యుడిగా ఉండనున్నారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా వారం పాటు పర్యటించి పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయరంగ పరిస్థితులపై అధ్యయనం చేసి మాజీ సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించనుంది.
నేడు జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రి యదర్శిని స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం జిల్లా స్థాయి క్రీడా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌వో వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్ క్రికెట్, చెస్, క్యారం, హాకీ, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నీస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఖోఖో, యోగా తదితర క్రీడాంశాల్లో మహిళలు, పురుషులకు వేరువేరుగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న పర్మినెంట్ ఉద్యోగులు వారి సర్వీస్ సర్టిఫికెట్, గుర్తింపు కార్డుతో ఉదయం 10 గంటలకు స్టేడియంలో రిపోర్ట్ చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment