అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
● గ్రామసభలు పకడ్బందీగా నిర్వహించాలి ● కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్: ఈనెల 21 నుంచి నిర్వహించనున్న గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా చే పట్టాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలుఅందేలా చూడాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఈ మేరకు సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన గ్రామసభల నిర్వహణపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను ప్రతి ష్టాత్మకంగా అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈమేరకు లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ ముందుకు సాగాలన్నారు.అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రా మ సభల్లో ఫ్లెక్సీలు, మౌలిక వసతులు ఏర్పాటు చే సుకోవాలని, అన్ని పంచాయతీ కార్యాలయాల నో టీసు బోర్డులపై అర్హుల జాబితాను ప్రచురించాలన్నారు. ఈ సభల్లో వచ్చే ఫిర్యాదులను రిజిస్టర్‌లో నమోదు చేయాలని, అలాగే అర్జీ లు స్వీకరించాలన్నారు. రోజువారీ ప్రక్రియను మండల ప్రత్యేక అధి కారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, గ్రామ సభల తీర్మాన ప్రతులను జాగ్రత్తగా భద్రపరచాలని సూ చించారు. ఇందులో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్ పాల్గొన్నారు.
బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం
బేల: బాధిత రైతుకుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని రేణిగూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవ్‌రావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలి సిందే. ఈమేరకు బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, తదితరులున్నారు.
ఆర్థిక సాయం అందజేత
బాధిత కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయంను రెవెన్యూ బృందం తరఫున తహసీల్దార్ రఘునాథ్‌రావు అందజేశారు.
గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
కై లాస్‌నగర్: ఈనెల 26న నిర్వహించనున్న గణ తంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదికను ప్రత్యేకంగా అలంకరించాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, షామియానా వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మట్, ట్రెయినీ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, డీఎస్పీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment