ఆదిలాబాద్: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన బ్రహ్మకుమారి వ్యవస్థాపకులు బ్రహ్మ బాబా స్మృతి దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సూచించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న , కేంద్రం నిర్వాహకురాలు రేవతి బెహన్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment