ఆదిలాబాద్‌టౌన్: మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం అండర్‌టేకింగ్ తీసుకున్నారు. ఈ బదిలీలకు సంబంధించి 41 మంది జాబితా డీఈవో కార్యాలయానికి చేరింది. మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి అండర్‌టేకింగ్‌లో తాము సీనియారిటీ కోల్పోతామని తదితర వివరాలతో పూర్తిచేసిన ప్రొఫార్మాను తీసుకున్నారు. త్వరలో పరస్పర బదిలీ చేసుకున్న ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు స్థానచలనం కలగనుంది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment