● అప్పు చెల్లించాలని బ్యాంకు అధికారుల వేధింపులు ● బ్యాం
బ్యాంకు సీసీ ఫుటేజ్ లో పురుగుల మందు తాగుతున్న రైతు జాదవ్ దేవ్‌రావు
మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. అన్న గేయానికి సరిగ్గా సరిపోయే సంఘటన ఇది. కళ్ల ముందు ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడితే శత్రువైనా సరే కాపాడేందుకు ముందుకొస్తారు. కానీ ఓ రైతు బ్యాంకు అధికారులు, సిబ్బంది ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినా వారు స్పందించకపోవడంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. రిమ్స్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆ బ్యాంకులోనే అన్నదాత తనువు చాలించడం ఆ ఉద్యోగుల మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. అందరూ చూస్తుండిపోవడమే తప్పా ఆస్పత్రికి తరలించే వారు కరువయ్యారు. కొంత మంది సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాల ను బంధించే ప్రయత్నం చేయడం గమనార్హం. బాధిత కుటుంబీకులు వచ్చిన తర్వాత ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. త్వరగా తీసుకొచ్చి ఉంటే ప్రాణాలు నిలిచేవని తెలిపినట్లు తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కుమారుడు, భార్య రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. – ఆదిలాబాద్‌టౌన్/ఆదిలాబాద్‌రూరల్
●
బేల మండలంలోని రేణుగూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవ్‌రావు(55) 2019లో జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌లో గల ఐసీఐసీఐ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ క్రాప్ (కేసీసీ) కింద రూ.3లక్షల 40వేల రుణం తీసుకున్నాడు. తన భార్య కిడ్నీ చెడిపోవడంతో తనకున్న రెండున్నర ఎకరాల భూమిని బ్యాంకులో మార్డిగేజ్ చేయించి అప్పు పొందాడు. ఆరు నెలలకోసారి రూ.25వే ల చొప్పున చెల్లిస్తున్నాడు. ఏడాది వరకు కిస్తీలు బాగానే చెల్లించాడు. అయితే సాగు చేసిన పత్తి దిగుబడి సరిగా రాకపోవడంతో పాటు భార్య అనారోగ్యంతో అప్పులు పెరిగాయి. ఈ క్రమంలో గత రెండు కిస్తీలు చెల్లించలేకపోయాడు.
బ్యాంకు అధికారుల వేధింపులు
కిస్తీలు చెల్లించాలని ఇటీవల బ్యాంకు అధికారులు సదరు రైతు నివాసానికి వెళ్లారు. వెంటనే అప్పు చెల్లించాలని వేధించారు. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేయడంతో బ్యాంకుకు వచ్చిన దేవ్‌రావు అధికారులను ప్రాధేయపడ్డాడు. అయినా విని పించుకోకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పు రుగుల మందును వారిముందే తాగాడు. సిబ్బందితో పాటు అధికారులు అలాగే చూస్తుండిపోయారే తప్ప ఆయన్ను పక్కనే ఉన్న రిమ్స్ ఆసుపత్రికి మాత్రం తరలించలేదు. రైతే తన కుమారుడికి ఫోన్‌చేసి పురుగుల మందు తాగిన విష యం చెప్పాడు. 15 నిమిషాల వరకు బ్యాంకులోనే ఉండగా ఆ తర్వాత అక్కడికి చేరుకున్న కు మారుడు, బంధువులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్యాంకుకు కూతవేటు దూరంలోనే ఆసుపత్రి ఉండగా,అక్క డి సిబ్బంది వెంటనే తరలించి ఉంటే ప్రాణాలు దక్కేవని కుటుంబీకులు పేర్కొన్నారు. మృతుడి భార్య కిడ్నీ సమస్యతో మంచానికి పరిమితం కాగా ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబాని ది ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితి.
బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేయాలి : ఎమ్మెల్యే శంకర్
రైతు మృతికి కారణమైన బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఘటన సమాచారం అందుకున్న ఆయన రిమ్స్‌కు చేరుకొని కుటుంబీకుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతులను వేధింపులకు గురిచేయడం ఏంటని బ్యాంకు అధికారులపై మండిపడ్డారు. మానవత్వం మరిచేలా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పేర్కొన్నారు. అలాగే మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న రిమ్స్‌కు చేరుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబీకులు, బంధువులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment