కై లాస్‌నగర్: నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం నేటి నుంచి ఆదిలాబాద్‌లో వార్డుసభలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్.రాజు ప్రకటనలో తెలిపారు. రవీంద్రనగర్ కాలనీలో మంగళవారం ఉదయం 9గంటలకు నిర్వహించనున్న వార్డు సభకు కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే 21న 13 వార్డులు, 22న 17వార్డులు, 23న 19 వార్డుల్లో లబ్ధిదారుల ఎంపిక సభలు ఉంటాయని తెలిపారు. ఆయా కాలనీల్లో నిర్వహించనున్న సభలకు అర్హులైనవారు హాజరై ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని
సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment