‘ఆరోగ్య పాఠశాల’పై జిల్లా స్థాయి పరీక్ష
కై లాస్‌నగర్: ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ రాజర్షి షా చొరవతో చేపట్టిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలుపై సోమవారం జిల్లాస్థాయి పరీక్ష నిర్వహించారు. మండలస్థాయిలో టాప్–3లో నిలిచిన స్టూడెంట్ చాంపియన్లకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల నుంచి ముగ్గురేసి చొప్పున 54 మంది హాజరయ్యారు. పరీక్షను కలెక్టర్ రాజర్షి షా స్వయంగా పరిశీలించారు. డీఈవో, విద్యార్థులతో మా ట్లాడి వారికి పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో మొదటి ముగ్గురిని ఎంపిక చేసి రిపబ్లిక్ డే వేడుకల్లో వారికి సర్టిఫికెట్, నగదు పురస్కారం అందించనున్నట్లు పే ర్కొన్నారు. ఇందులో డీఈవో ప్రణీత, ఆరోగ్య పాఠశాల జిల్లా కన్వీ నర్ డి.అజయ్‌కుమార్ ఆరోగ్య పాఠశాల రిసోర్స్‌పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment