విద్యాశాఖ ఏడీగా వేణుగోపాల్‌గౌడ్
కై లాస్‌నగర్: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డై రెక్టర్‌గా కే.వేణుగోపాల్ గౌడ్ నియామకమయ్యారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు ఏడీగా పదోన్నతి కల్పించిన ప్ర భుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీఈవో ప్రణీత, సెక్టోరియల్ అధికా రులు జే.నారాయణ, సుజాత్ అలీ, ఉదయ శ్రీ,, సూపరింటెండెంట్లు రమణ, మధుసూదన్‌లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అలాగే స్థానిక ప్రభుత్వ డైట్ కళాశాల సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న భోజన్నకు ఏడీగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం ఆయనను వికారాబాద్ జిల్లాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో పరీక్షల విభాగంలో పనిచేస్తున్న మ మతను సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment