గుడిహత్నూర్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థమే సీజీఆర్‌ఎఫ్ పని చేస్తోందని తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మండల కేంద్రంలో సోమవా రం ఏర్పాటు చేసిన వినియోగదారుల ఫిర్యాదులు, పరిష్కార వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు ఎలాంటి సమస్యలున్నా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి తెలియజేయాలన్నారు. పరి ష్కారం కాని పక్షంలో తమ దృష్టికి తీసుకువస్తే నిర్ణీ త కాల పరిమితిలో పరిష్కరిస్తామన్నారు. అనంత రం పలువురు అందించిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. వాటిని పరిష్కరించాలని ఏఈ గౌతంను ఆదేశించారు. ఇందులో సీజీఆర్‌ఎఫ్ టెక్నికల్ మెంబర్ రామకృష్ణ, సంస్థ ఫైనాన్స్ మెంబర్ కిషన్, రాజాగౌడ్, అధికారులు తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment