జాతీయస్థాయి ప్రమాణాలు పాటించాలి
● వైద్యులకు కలెక్టర్ దినేష్‌కుమార్ సూచన
● ఎన్‌క్యూఎస్ ధ్రువపత్రాల పంపిణీ
పాడేరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని పొందేందుకు జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లాలోని 18 ఆస్పత్రులకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్(ఎన్‌క్యూఎస్) సర్టిఫికెట్లను కలెక్టర్ దినేష్‌కుమార్ వైద్యులకు అందజేశారు.
జిల్లా పరిధిలోని అరకు, చింతపల్లి, కూనవరం ప్రాంతీయ ఆస్పత్రులకు, ఇందుకూరిపేట, తాజంగి, సప్పర్ల, పిడతమామిడి, జి.మాడుగుల, ఎల్లవరం, లాగరాయి పీహెచ్‌సీలకు, ముసిరిపల్లి, గుత్తులపుట్టు, అడుగులపుట్టు, కొత్త పాడేరు, నెల్లుపూడి, చింతూరు హెల్త్ ఆండ్ వెల్‌నెస్ సెంటర్లకు గుర్తింపు పొందాయి. ఈ మేరకు సంబంధిత వైద్యాధికారులకు, కమ్యూనిటి హెల్త్ సిబ్బందికి కలెక్టర్ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మావతి, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment