‘మద్యం సిండికేట్‌లో అధికారుల పాత్రపై విచారణ జరపాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మద్యం సిండికేట్‌లో అధికారుల పాత్రపై విచారణ జరపాలి’

Published Sat, Nov 9 2024 1:47 AM | Last Updated on Sat, Nov 9 2024 1:47 AM

-

రంపచోడవరం : రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో న్న ఏడు మండలాల్లో మద్యం షాపుల సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తూ, ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్న గ్రూపు–2 అధికారి ముఖలింగం, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరి కొంత మంది ప్రభుత్వ అధికారులపై పీసా చట్ట ప్రకారం క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోత రామారావు, మట్ట వాణిశ్రీ డిమాండ్‌ చేశారు. మద్యం షాపుల సిండికెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న రాజమహేంద్రవరం డ్వామా పీడీ ముఖలింగం, కొంత మంది అధికారులపై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపట్టాలని వారు కోరారు. వారి ఆర్థిక వ్యవహారాలపై విజిలెన్స్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వీరిపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement