డిమాండ్ మేరకే విద్యుత్ ఉత్పత్తి
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో డిమాండ్ మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం 240 మెగావాట్లతో నాలుగు యూనిట్లు వినియోగంలోకి వచ్చాయన్నారు. లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు పైఅధికారులు ఎపు్పుడు విద్యుత్ అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రెండు రోజుల క్రితం 4వ నెంబరు యూనిట్‌లో చిన్నపాటి బ్రేక్ ఆగ్జలరీ స్విచ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. సాంకేతిక సమస్యను సరిచేసి శుక్రవారం నుంచి 4వ నంబరు యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో హైడల్ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్‌కు అంత డిమాండ్ లేనందున పగటి పూట ఒక యూనిట్‌తో రాత్రిపూట రెండు యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఇదంతా లోడ్ డిస్పాచ్ అధికారుల ఆదేశాల మేరకు జరగుతుందని పేర్కొన్నారు. సీలేరు బేసిన్‌లో నీటి నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఈఈ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీఈ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సీలేరు జలవిద్యుత్‌కేంద్రం
ఈఈ రాజేంద్రప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment