విజృంభిస్తున్న చలిగాలులు
● తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● మినుములూరులో 14,
అరకు, చింతపల్లిలో 18 డిగ్రీల నమోదు
సాక్షి,పాడేరు: మన్యంలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. శుక్రవారం పాడేరు ప్రాంతంలో చలితీవ్రత పెరిగింది. పాడేరుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద ఉదయం 17డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం, అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 18డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లంబసింగి, తాజంగి, అన్నవరం, జి.మాడుగుల, అరకులోయ, పెదబయలు, ముంచంగిపుట్టు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురిసింది.
డీఎస్సీ ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ పరీక్ష వాయిదా
రంపచోడవరం: ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా రెసిడెన్షియల్ డీఎస్సీ కోచింగ్ ఎంపికకు ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ అనుమతి ఇచ్చినట్టు ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. అయితే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేయడానికి కాకినాడ జిల్లా ఆదిత్య విశ్వవిద్యాలయం, సూరంపాలెంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించాల్సిన ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష వాయిదా పడినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులో ఉన్నందున వాయిదా పడిందన్నారు. ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షకు వెళ్లే విద్యార్థులు వాయిదా విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment