సమస్యల పరిష్కార వేదికలో177 వినతుల స్వీకరణ
పాడేరు : ప్రజల నుంచి స్వీకరించే వినతుల పరిష్కారంపై దృష్టి సారించాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఐటీడీఏ పీవో అభిషేక్, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో పద్మావతి ప్రజల నుంచి 177 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం పీజీఆర్ఎస్ వెబ్సైట్ పరిశీలించి వివిధ శాఖలకు వచ్చిన అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యవశాయశాఖ అధికారి నందు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి రమేష్‌కుమార్, టీడబ్ల్యూ ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, వేణుగోపాల్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్ కుమార్, డీఎల్పీవో కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment