విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
జి.మాడుగుల: ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా సామర్థ్యాలు మరింత మెరుగుపడాలని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ స్పష్టం చేశారు. మండలంలో గెమ్మెలి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఈ ఆశ్రమ పాఠశాలలో 9, 10తరగతులు విద్యార్థులకు ఇంగ్లిష్, గణితం, సోషల్ పాఠ్యాంశాలను ఆయన బోధించారు. విద్యార్థులు ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులలో సామర్థ్యాలను మెరుగుపర్చాలని ఉపాధ్యాయులను ఆయన ఆదేశించారు. మెనూ అమలుతీరుపై ఆయన ఆరా తీశారు. ప్రతీ రోజు నిర్ధేశించిన మెనూ సక్రమంగా నాణ్యమైన భోజనం అందజేయాలని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. విద్యార్థుల పఠనా సామార్థ్యాలను పరిశీలించి ఎ,బి,సీ,డీ గ్రూపులుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. సీ,డీ గ్రూపుల్లో విద్యార్థులు సామర్థ్యాలను మెరుగుపర్చటానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థుల ఆధార్ జనరేషన్ గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రతీ విద్యార్థికి ఆధార్, ఆపార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గెమ్మెలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఓపీని అడిగి తెలసుకున్నారు. లేబరేటరీ, ఫార్మసీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గెమ్మెలిలో తాగునీటి సమస్యను విన్నవించారు. దీనిపై తక్షణమే స్పందించి, గ్రామంలో తాగునీటి సదుపాయం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కొత్తపల్లి జలపాతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న సుందరీకరణ పనుల పురోగతి, తదితర విషయాలు ఆయన పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు, సిబ్బంది ఉన్నారు.
తాగునీటి సమస్య పరిష్కరిస్తాం
పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్
Comments
Please login to add a commentAdd a comment