క్రీడాకారులకు అభినందనలు
రాజవొమ్మంగి: స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో గిరిజన విద్యార్థులు ప్రతిభ చూపుతున్నారు. రాజవొమ్మంగి ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్.మౌనిక వెయిట్ లిఫ్టింగ్‌లో స్టేట్‌లో ద్వితీయ స్థానం సాధించింది. గుడివాడలో ఈనెల 15న జరిగిన ఈ పోటీల్లో అండర్–19 విభాగంలో ఉత్తమ ప్రతిభకనబర్చినట్టు ప్రిన్సిపాల్ ఎం.వి.కృష్ణారావు చెప్పారు. పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని మౌనిక, ట్రైనర్ మాణిక్యాలరావును ప్రిన్సిపాల్ కృష్ణారావుతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. మండలంలోని బోర్నగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో (స్పోర్ట్స్ స్కూల్) 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మోడిద సత్యనారాయణ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్టు హెచ్‌ఎం రమేష్‌బాబు తెలిపారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఇటీవల రంపచోడవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో ఈ విద్యార్థి ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థి సత్యనారాయణను హెచ్‌ఎం రమేష్‌బాబుతో పాటు ఉపాధ్యాయులు బొడారపు కృష్ణ, కోటేశ్వర్రావు వరప్రసాద్, గంగన్నదొర, విశ్వనాథరెడ్డి, విజయబాబు తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment