19 కిలోల గంజాయి పట్టివేత
ముంచంగిపుట్టు: మండలంలోని వనభసింగి పంచాయతీ కొత్తూరు జంక్షన్ వద్ద బుధవారం తరలిస్తున్న 19.470 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై పక్కా సమాచారంతో పోలీసులు కొత్తూరు జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. బైకు, ఆటోలో వస్తున్న నిందితులు పోలీసులను చూసి రెండు బస్తాలను విడిచిపెట్టి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, వీఆర్‌వో సమక్షంలో తూకం వేశారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా పనసపుట్టు పంచాయతీ ముసిగూడ గ్రామానికి చెందిన పాడు మ జ్జి, కొర్రాపుట్టు జిల్లా నందపూరు బ్లాక్ పాడువా పంచాయతీ చంపాపుట్టు గ్రామానికి చెందిన కిల్ల మధు, అల్లూరి జిల్లా అరకువేలి మండలం పెదలబుడు పంచాయతీ తాంగులగూడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాంగుల పరుశురామ్, డుంబ్రిగుడ మండలం గుంటసీమ పంచాయతీ దొరగూడ గ్రామానికి చెందిన గడ్డంగి సోమరాజులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.లక్ష ఉంటుందని, మూడు సెల్‌ఫో న్లు, రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై, కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని, పరారీలో ఉన్న మరో నిందితుడి వివరాలు సేకరిస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment