● కేంద్ర అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ రాహుల్ కప
స్పందన బాగుంది
డ్వాక్రా ఉత్పత్తుల మేళాకు విశాఖ ప్రజల స్పందన చాలా బాగుందని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ రాహుల్ కపూర్ అన్నారు. ఏపీ మెప్మా ఎండీ ఎన్.తేజ్ భరత్‌తో కలసి ఆయన మేళాను సందర్శించారు. ప్రతి స్టాల్‌కు వెళ్లి కొనుగోళ్ల వివరాలు, నగర వాసుల స్పందనను తెలుసుకోవడంతో పాటు ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించారు. రాహుల్ కపూర్ మాట్లాడుతూ ఎస్‌హెచ్‌జీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఈ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ నగర ప్రజల నుంచి మేళాకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, మెప్మా ఎండీ తేజ్ భరత్‌తో కలిసి సే నో టూ ప్లాస్టిక్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ 25న ప్రారంభమైన మేళా ఇప్పటి వరకు రూ.27 లక్షల కొనుగోళ్లు సాధించిందన్నారు. ఈ నెల 29 వరకు మేళా విజయవంతంగా కొనసాగుతుందన్నారు. అనంతరం రాహుల్ కపూర్, మెప్మా ఎండీలను సత్కరించారు. జీవీఎంసీ యూసీడీ పీడీ సత్యవేణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment