పర్యాటకుల మదిని దోచేలా అల్లూరి పార్క్ సుందరీకరణ
కొయ్యూరు: విప్లపం రూపం దాలిస్తే సరిగ్గా ఇలానే ఉంటుంది...ధైర్యం ఆకారాన్ని సంతరించుకుంటే ఇలా నిండైన విగ్రహంగా మారుతుంది. అలాంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అకుంఠిత త్యాగదీక్ష, సచ్ఛీలత,ఏకాగ్రత మనముందు ఆవిష్కరింపజేసేలా కేంద్రప్రభుత్వ నిధులతో చేపట్టిన అల్లూరి స్మారకపార్క్ సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. మంపలో అల్లూరి పట్టుబడిన కొల నును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీనిని శుక్రవారం పరిశీలించిన కేంద్ర సాంస్కృతిక శాఖసంయుక్తకార్యదర్శి నండూరి ఉమ సంతృప్తి వ్యక్తం చేశారు.కొలను మధ్యలో ధాన్య ముద్రలో ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటోంది. ధాన్యముద్రలో ఉన్న అల్లూరి విగ్రహాన్ని మొదటిసారి ఇక్కడే చూశా నని ఉమ తెలిపారు.దీంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా కొలనుచుట్టూ సిమెంట్‌తో ఎత్తైన గట్టును ఏర్పాటు చేశారు. నలువైపులా అల్లూరి చరిత్రను తెలిపే చిత్రాలను గోడలపై ఏర్పాటు చేస్తున్నారు. అల్లూరి స్మారక స్తూపాన్ని కూడా తీర్చిదిద్దనున్నారు.
అల్లూరి చరిత్ర భావితరాలకు తెలిసేలా...
చింతపల్లి : అల్లూరి సీతారామరాజు తిరుగాడిన నేలగా ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న మన్యంలోని ప్రాంతాలన్నింటినీ పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక విభాగం జాయింట్ సెక్రటరీ ఉమ అన్నారు. ఆమె శుక్రవారం ఐటీడీఏ పీవో అభిషేక్‌తో కలసి చింతపల్లి, కొయ్యూరు, కృష్ణదేవీపేట ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ అల్లూరి స్మారకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి చరిత్ర భావి తరాలకు తెలిసేలాప్రత్యేక పర్యాటకప్రాజెక్టులను అమలు చేసి అందులో వీటిని చేర్చాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, క్షత్రియ పరిషత్ విభాగం నాయకులు నానిరాజు, రఘు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment