నిరసనలో ఉద్రిక్తత
పాడేరు: గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి అదృశ్యం, మృతి చెందిన ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలని, మృతుడి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాడేరు ఐటీడీఏ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, వారికి మద్దతుగా ఎస్‌ఎఫ్‌ఐ, పలు మహిళా సంఘాల చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే కొయ్యూరు గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో టెన్త్ చదువుతున్న వంతాల మనోజ్ అనే విద్యార్థి ఇటీవల అదృశ్యమై, ఈనెల 25న చెరువులో శవమై తేలాడు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని అమలు చేయకపోవడంతో మృతిచెందిన విద్యార్థి కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం పాడేరు ఐటీడీఏ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుమారు గంటన్నర పాటు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారని నిరసనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తున్న మృతుడి తండ్రి సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ, మహిళ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి, జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పలువురు మహిళలపై ఏఎస్‌ఐ సాయి అనుచితంగా ప్రవర్తించారని బాధిత మహిళలు ఆరోపించారు. ఈవిషయంపై కలెక్టర్ స్పందించి తమకు న్యా యం చేయాలని, మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన ఏఎస్‌ఐ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
పాడేరు ఐటీడీఏ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ,
మహిళా సంఘాల ఆందోళన
అరెస్టు చేసిన పోలీసులు
ఏఎస్‌ఐ తీరుపై మహిళల మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment