వణుకుతున్న జిల్లా
సాక్షి,పాడేరు/చింతపల్లి: జిల్లాలో చలితీవ్రత అధికమైంది.చలిగాలులు విజృంభిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డులో 8 డిగ్రీలు,పెదబయలులో 9.3, జి.మాడుగులులో 9.5, అనంతగిరిలో 10.3, హుకుంపేటలో 10.6,ముంచంగిపుట్టులో 10.8, జీకే వీధిలో 11.6,అరకులోయ కేంద్ర కాఫీబోర్డులో 11.8,చింతపల్లిలో 13.4, కొయ్యూరులో 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణొగ్రతలు సోమవారం నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో పాడేరులో ఉదయం 11గంటలు దాటిన తరువాత సూర్యోదయం అయింది. పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.చలితీవ్రతతో ప్రజలు,పర్యాటకులు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
చింతపల్లి మండలం రాజుపాకలు సమీపంలో కురుస్తున్న మంచు
Comments
Please login to add a commentAdd a comment