గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
పాడేరు : గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఐటీడీఏ పీవో అభిషేక్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠ శాలల హెచ్‌ఎంలు, గిరిజన గురుకులాల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి పాఠశాలలో ఒక ప్రామాణిక విధానాన్ని అమలు చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు జారీ చేసిన ఫార్మట్‌లో ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు ప్రతి నెలా నివేదికలు సమర్పించాలన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిక్ రూమ్‌లో ఉంచాలని సూచించారు. అవసరమైతే ఆస్పత్రులకు తరలించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. గుర్తింపు కార్డు కలిగిన వారితోనే విద్యార్థులను బయటకు పంపించాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మూమెంట్ రిజిస్టర్లను పక్కాగా అమలు చేయాలన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే తల్లిదండ్రులు, సంరక్షకులను అనుమతించాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అనర్థాలపై విద్యార్ధులకు తరచూ కౌన్సిలింగ్ చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మార్గదర్శిని కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఎక్కడైన గంజాయి వినియోగించే విద్యార్ధులు బయటపడితే తక్షణమే డి ఎడిక్షన్ కేంద్రానికి తరలించి కౌన్సిలింగ్ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో టీడబ్ల్యూ ఇంచార్జీ డీడీ రజని, డీఈవో బ్రహ్మాజీరావు, 11మండలాల ఏటీడబ్ల్యూవోలు,హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
తల్లిదండ్రులకు గుర్తింపు కార్డులు
పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్
Comments
Please login to add a commentAdd a comment