చిన్నారికి తీవ్ర అస్వస్థత
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో కిరాణా షాప్‌లో కాలం చెల్లిన విశాఖ డెయిరీకి చెందిన పెరుగు ప్యాకెట్‌ను భోజనంలో వినియోగించడం వల్ల ఏడేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. స్థాని క కిరాణా వ్యాపారి ప్రభాకర్ దుకాణంలో మంగళవారం సాయంత్రం పెరుగు ప్యాకెట్ కొని ఇంటికి తీసుకొని వెళ్లినట్టు చిన్నారి తండ్రి మొస్య సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ పెరుగుతో కుమార్తె పూజారాణి (7)కి అ న్నం పెట్టామని, కొద్ది సమయంలోనే తీవ్ర అస్వస్థకు గురైందని ఆయన వివరించారు. పెరు గు ప్యాకెట్‌పై గత నెల 25వ తేదీన కాలం చెల్లినట్లు ఉందన్నారు. దీంతో వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించడంతో తమ కుమార్తెకు ప్రాణాపాయం తప్పిందని ఆయన వివరించారు. ఇలావుండగా కాలం చెల్లిన వాటిని విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కాలం చెల్లిన పెరుగు ప్యాకెట్‌నువినియోగించడంతో విషమించిన ఆరోగ్యం
వెంటనే ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి
తరలింపు
సకాలంలో వైద్యం అందించడంతోతప్పిన ప్రాణాపాయం
Comments
Please login to add a commentAdd a comment