పాఠశాలలకు కార్పెట్లు పంపిణీ
రంపచోడవరం: మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లోని ప్రాథమిక పాఠశాలలకు కార్పెట్లు అందజేసినట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం చెప్పారు. ఐటీడీఏ కార్యాలయం ప్రాగంణంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో వై.రామవరం, మారేడుమిల్లి మండలాల్లోని పాఠశాలలకు సబ్ కలెక్టర్ కల్పశ్రీతో కలిసి బుధవారం ఆయా ఎంఈవో, వెల్పేర్ అసిస్టెంట్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా పీవో సింహాచలం మాట్లాడుతూ ఐటీడీఏ, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, తుని శాఖ ఆధ్వర్యంలో కార్పెట్లు అందజేస్తామన్నారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనలో విద్యార్థులు కింద కూర్చొవడంతో చలికి ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్పెట్లు అందజేసినట్లు తెలిపారు. ఎంఈవో వి.ముత్యాలరావు, వెంకటరమణ, ఎంపీడీవో బాపన్నదొర, డీఈ నాగరాజు, మేనేజర్ మూర్తి, కాజా, అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.
రంపచోడవరం ఐటీడీఏ పీవో
కట్టా సింహాచలం
Comments
Please login to add a commentAdd a comment