19న పాడేరులో మోదకొండమ్మతల్లి తీర్థం
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి తీర్థమహోత్సవాన్ని ఈనెల 19వ తేదీ ఆదివారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఒకరోజు నిర్వహించే తీర్థానికి సంబంధించి సోమవారం ఆలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన గ్రామపెద్దలు,ఆలయ కమిటీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ముందుగా మోదమ్మకు ఎమ్మెల్యే తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తీర్థం నిర్వహణకు తేదీని ఖరారు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏడాది భక్తుల సహకారంతో ఆలయ కమిటీ మోదకొండమ్మతల్లి తీర్థాన్ని ఘనంగా నిర్వహిస్తోందని చెప్పారు. ఈ ఏడాది కూడా అన్ని వర్గాల భక్తులు భాగస్వామ్యమై విజయవంతం చేయాలన్నారు.అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.మోదమ్మ ఉత్సవ విగ్రహ ఉరేగింపును వైభవంగా జరుపుతామని చెప్పారు. ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా మైదాన ప్రాంత భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, గ్రామపెద్దలు గంగన్నపడాల్, పలాసి కృష్ణారావు, స్థలదాత లకే ఈశ్వరమ్మ,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు,సభ్యులు లకే రత్నాబాయి,డి.పి.రాంబాబు,చల్లా రామకృష్ణ,రమణ,కూడా సురేష్‌కుమార్,వర్తక సంఘం నేతలు ఉడా త్రినాఽథ్,మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఆలయ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
Comments
Please login to add a commentAdd a comment