పసుపు, పిప్పళ్ల సేకరణలో గిరి రైతుల నిమగ్నం
పెదబయలు: పసుపు, పిప్పళ్ల సేకరణలో గిరి రైతులు నిమగ్నమయ్యారు. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి పసుపు, పిప్పళ్ల సేకరణ జరుగుతుంది. అయితే మార్కెట్ ధర బాగుంటే గిరిజన రైతులు ఎంతో వేగంగా సేకరించి అమ్మకాలు చేస్తారు. అయితే ఈ ఏడాది పసుపు, పిప్పళ్ల ధర రైతులను నిరాశపరిచాయి. ప్రస్తుతం మార్కెట్లోని ధరలు కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చేలా లేవని వారు వాపోతున్నారు. మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో పసుపు సేకరణ చేయాల్సి వస్తోందని, లేకుంటే పాడై పోతుందని వారు పేర్కొన్నారు. గత ఏడాది పిప్పళ్లు ధర బాగుందని, ఈ ఏడాది మాత్రం తక్కువగా ఉందని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment