58 కిలోల గంజాయి స్వాధీనం
● ఇద్దరు నిందితుల అరెస్టు
● వీరిలో ఒకరు బాలుడు
గూడెంకొత్తవీధి: ఒడిశానుంచి కారులో గంజాయి తరలిస్తూ గూడెం కొత్తవీధి వద్ద పోలీసులకు ఇద్దరు పట్టుబడ్డారు. సీఐ వరప్రసాద్ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీలేరుకు చెందిన ఇద్దరు కారులో గంజాయి తరలిస్తుండగా శుక్రవారం సాయంత్రం సిబ్బంది చేపట్టిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. వారి నుంచి 58 కిలోల స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తరలిస్తున్న వారిలో ఒకరు సీలేరుకు చెందిన పెదపూడి చినబాబు మరొకరు బాలుడు ఉన్నారన్నారు. వీరు ఒడిశాలోని రాజ్‌బేడాక్ అనే గ్రామంలో కొనుగోలు చేసి తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్ ఫోన్లు, కారు, రూ.320 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులో ఒకరు బాల నేరస్తుడు కావడంతో అతనిని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment