బడ్జెట్ కేటాయింపులో ఆదివాసీలకు అన్యాయం
పాడేరు రూరల్: ఆదివాసీల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ అంటూ ప్రచార్బాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను మరింత దిగజార్చేలా బడ్జెట్ కేటాయింపు చేసిందన్నారు. బడ్జెట్‌లో దేశ ఆదివాసీ జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాంగబద్దంగా 8.8 శాతం నిధులు కేటయించాలన్నారు. ఆదివాసీ సబ్ ప్లాన్ రూ.3,54,574 కోట్లకు కేవలం రూ,1,29,249 కోట్లు మాత్రమే కేటయించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఆదివాసీల అభివృద్ధికి నేరుగా ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు పూర్తిగా తగ్గించి కార్పొరేట్, బడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. ఆదివాసీల విద్యారంగానికి గత ఏడాది రూ. 240 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 2కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌కు గత ఏడాదిలో రూ.440 కోట్లు కేటయించగా ఈ ఏడాది రూ.313 కోట్లు కేటయించిందన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా విద్యారంగాలకు కేటయించే బడ్జెట్ మొక్కుబడిగా ఉందన్నారు. ఇకనైనా గిరిజన ప్రాంతాల్లో రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం
జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment