స్పీకర్ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన
హుకుంపేట: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు 1/70 చట్టం సవరణ చేయాలన్న వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టాయి. దీనిలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ బంకు నుంచి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు గిరిజన సంఘం, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల గిరిజన సంఘం నేత తాపుల కృష్ణారావు, వైఎస్సార్‌సీపీ మండల గౌరవ అధ్యక్షుడు మాట్లాడుతూ గండేరు చినసత్యం 1/70 చట్టంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిరిజన చట్టాల జోలికి వస్తే సహించమని స్పష్టంచేశారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు గిరిజనులకు క్షమాపణ చెప్పాలని, అప్పటివరకు తగ్గేది లేదని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎం.విశ్వేశ్వరరావు, నాయకులు తెడబారికి సురేష్‌కుమార్, తడిగిరి సర్పంచ్ పెనుమల రంజిత్‌కుమార్, సీపీఎం నేతలు వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, రామారావు, కాంగ్రెస్ నేతలు చిన్నస్వామి, జానకిరావు, సాధు పాల్గొన్నారు.
హుకుంపేటలో ప్రజాసంఘాల ఆందోళన
అయ్యన్నపాత్రుడు తక్షణం పదవికి
రాజీనామా చేయాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment