సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌కు ఉత్తమ పురస్కారం
● లక్ష్యానికి మించి ఉత్పత్తి
● వెల్లడించిన జలవిద్యుత్ కేంద్రం
ఈఈ రాజేంద్రప్రసాద్
సీలేరు: జల విద్యుత్ ఉత్పత్తిలో 2023–2024 సంవత్సరానికి సీలేరు కాంప్లెక్స్‌కు ఓవరాల్‌గా ఉత్తమ పురస్కారం లభించిందని జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా పురస్కారాన్ని ఏపీ జెన్‌కో ఉన్నతాధికారులు ప్రదర్శించారు. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో పొల్లూరు, డొంకరాయి, సీలేరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాల్లో ఆర్థిక సంవత్సరంలో మెరుగైన విద్యుత్ ఉత్పత్తి సాధించింది. జలవిద్యుత్ రంగంలో సీలేరు కాంప్లెక్స్ 2,279 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యంలో 2,308 మిలియన్ యూనిట్లు సాధించిందన్నారు. అదనంగా 39 మిలియన్ యూనిట్లు సాధించి పురస్కారం దక్కించుకున్నట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీరు సమష్టి కృషి ఫలితమే ఈ పురస్కారమన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు మిఠాయి లు పంచారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో ఏడీఈలు అప్పారావు, శ్రీధర్ కుమార్, సత్యనారాయణ, సుమన్, ఏఈఈ నాగబాబు, బాషా,విజిలెన్స్ సిబ్బంది సుధాకర్, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment