సుంకరమెట్ట లైన్‌మన్‌కు ప్రమాదం
● విద్యుత్ స్తంభంపై నుంచి పడటంతో తీవ్ర గాయం ● పరిస్థితి విషమం ● కేజీహెచ్‌కు తరలింపు
అరకులోయ టౌన్: మండలంలోని ఏపీఈపీడీసీఎల్ సుంకరమెట్ట లైన్‌మన్ గెమ్మెలి ప్రసాద్ (38) ప్రమాదానికి గురయ్యారు. మంగళవా రం సుంకరమెట్ట హౌసింగ్ కాలనీలో విద్యుత్ స్తంభం నుంచి కిందపడటంతో తీవ్ర గాయాల య్యాయి. వెంటనే స్థానికులు అతనిని హుటాహుటిన సుంకరమెట్ట పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్‌లో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. తక్షణ వైద్యం అందించిన వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తల వెనుకవైపు బలమైన గాయమైంది. లైన్‌మన్ డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామమని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment