● ఈనెల 26 వరకు గడువు ● జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
పాడేరు : ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పీఎంఎఫ్‌ఎంఈ)ను సమర్థవంతంగా అమలుచేసేందుకు మండల స్థాయి లో రిసోర్స పర్సన్లను ఎంపిక చేస్తామని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 నవంబర్ 1వతేదీ నాటికి 21 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత పొంది కంప్యూటర్, ఇంటర్నెట్‌లో ప్రావీణ్యం ఉండి, సొంత స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటిని ఈనెల 26లోగా ఆయా మండలాల్లో ఉన్న వెలుగు కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, సహాజ వనరుల అభివృద్ధి రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎంపికై న అభ్యర్థులు ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థాపకులను పీఎంఎఫ్‌ఎంఈ పథకంలో చేరేలా ప్రోత్సహించాల్సి ఉందన్నారు. డీపీఆర్ తయారు చేయడం, బ్యాంకు రుణాలు మంజూరు చేయడం, ఎఫ్‌ఎన్‌ఎన్‌ఏఐ ఉద్యోగ్ ఆధార్, జీఎస్టీ, ఆహార ప్రమాణాలతో సహా రిజిస్ట్రేషన్, లైసెన్సులు పొందే విధంగా అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment