పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
పాడేరు : పశుసంవరర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ కోరారు. మంగళవారం తన చాంబర్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఉచిత పశువైద్య శిబిరాల వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈనెల 20 నుంచి 31వరకు జిల్లా వ్యాప్తంగా 441 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పశుసంవర్థక శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్‌కు తెలిపారు. ఈ శిబిరాల్లో పశువులకు అవసరమైన చికిత్సలతో పాటు గర్ఫకోశ వ్యాధులకు చికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు, పశువ్యాధి నిర్థారణ పరీక్షలు ఉచితంగా అందజేస్తామన్నారు. జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ గ్రామాల్లో శాసీ్త్రయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ డాక్టర్ నర్శింహులు, వెటర్నరీ వైద్యులు డాక్టర్ సృజన, డాక్టర్ రాజీవ్‌కిశోర్ పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ
Comments
Please login to add a commentAdd a comment