మోదకొండమ్మకు కుంకుమార్చన
అరకు ఎంపీ తనూజరాణి, మహిళా కమిషన్ సభ్యురాలు ఉమ ప్రత్యేక పూజలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లిని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజరాణి,ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమాలు మంగళవారం దర్శించుకున్నారు. మోదమ్మకు కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిముడు కోటిబాబునాయుడు,కాపు సంక్షేమసంఘం నేత దాసరి ఈశ్వరమ్మ,ఇతర కమిటీ సభ్యులంతా శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అమ్మవారి చిత్రపటాలను జ్ఞాపికగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment