కన్యకాపరమేశ్వరి ఆలయ నిర్మాణానికి స్థల పరిశీలన
అరకులోయ టౌన్: నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ నిర్మాణానికి మంగళవారం ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, స్థానిక ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులతో కలిసి స్థల పరిశీలన చేశారు. గత కొన్నేళ్లుగా అరకులోయలో శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆర్యవైశ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకులోయ వచ్చిన రాకేష్‌ను స్థానిక ఆర్యవైశ్యుల సంఘం ప్రతినిధులు కలిసి అమ్మవారి ఆలయ నిర్మాణం గురించి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన స్ధానిక ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. అరకులోయలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహాకారాలు అందిస్తానని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకులు బాల గణేష్, సర్పంచ్ దాసుబాబు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు కొల్లా రమేష్‌బాబు, రంగా, వెలగా గుప్త, కొల్లాప్రసాద్, పొట్ట ప్రకాష్, కాపుగంటి గుప్తా, భాస్కర్‌రావు, గణేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment