![- - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/14/14022024-akp-02_subgroupimage_1319952784_mr_0.jpg.webp?itok=fc3Pyse6)
పట్టణంలోని తులసీనగర్‌కు చెందిన ఆడారి శ్రీధర్(చిన్నా), రంగావారి వీధికి చెందిన చెక్కా పార్వతిలది ప్రేమ వివాహం. 25 ఏళ్ల క్రితం వీరిద్దరికీ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నేతగా ప్రజలకు సేవలందిస్తున్న శ్రీధర్ సామాజిక కార్యక్రమాల్లో భాగంగా గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లినపుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శ్రీధర్ గతంలో యలమంచిలి జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా పదవుల్లో పనిచేశారు. పార్వతి యలమంచిలి మున్సిపాలిటీలో 6వ వార్డు కౌన్సిలర్‌గా ప్రజాసేవ చేస్తున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత వేర్వేరు కులాలు కావడంతో పార్వతి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ససేమిరా అన్నారు. తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా కుమార్తె, కుమారుడు జన్మించారు. కుమార్తె ఎంబీఏ కోర్సు చేస్తుండగా, కుమారుడు బీటెక్ చదువుతున్నారు. 21 ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు.
యలమంచిలి కాకివాని వీధికి చెందిన పాస్టర్ కోసూరి బాలకృష్ణ పీటర్, భార్య భారతి ప్రిస్కిల్లా ఆరు నుంచి పదో తరగతి వరకు రాంబిల్లి మండలం లాలంకోడూరు హైస్కూల్‌లో చదువుకున్నారు. ఒకే తరగతికి చెందిన వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. భారతిది అగ్రకులం కావడంతో వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లోవారు ఒప్పుకోలేదు. అయినప్పటికీ 1985 మార్చి 14న వీరిద్దరూ విశాఖ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి వారి సహకారంతో వివాహం చేసుకున్నారు. బాలకృష్ణ పీటర్ స్వస్థలం రాంబిల్లి మండలం కొత్తపట్నం, భారతి ప్రిస్కిల్లాది అదే మండలం లాలంకోడూరు గ్రామం. వీరి వివాహం అప్పట్లో ఈ ప్రాంతంలో సంచలనం. వీరికి ఇద్దరు కుమారులు. కాకివానివీధిలో ఉంటున్న వీరి కుటుంబం.. అక్కడే ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరం నిర్వహిస్తున్నారు. నమ్మకమైన బంధానికి ప్రతి రూపమే ప్రేమ అని, ఇది లేకుండా మనిషి సంఘజీవుడు కాలేడని చెబుతున్నారు ఈ దంపతులు. 35 ఏళ్లుగా తమ దాంపత్యం అన్యోన్యంగా సాగుతోందని, మా మధ్య ఏనాడూ భేదాభిప్రాయాలు రాలేదని వారంటున్నారు. – యలమంచిలి రూరల్
అన్యోన్య బంధం
![1](https://www.sakshi.com/gallery_images/2024/02/14/13ylm02a_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment