రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు గునుపూడి విద్యార్థి
రగ్బీ పోటీలకు ఎంపికై న లగుడు అరవింద్‌తో వ్యాయామ ఉపాధ్యాయుడు నాయుడు
నాతవరం: గునిపూడి హైస్కూల్ పదో తరగతి విద్యార్థి లగుడు అరవింద్ జిల్లా స్థాయి రగ్బి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారడు. ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్‌లో అరవింద్ సత్తా చాటాడు. ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్‌ఎం టి.శివజ్యోతి గురువారం మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అరవింద్‌కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇటీవల తమ హైస్కూల్ నుంచి కొందరు బాలికలు సైతం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభకనబరిచారన్నారు. అరవింద్‌ను వ్యాయామ ఉపాధ్యాయుడు ఎల్.నాయుడు, విద్యా కమిటీ చైర్మన్ ఎన్.సత్యవతి, సీఆర్పీ పోలుపర్తి నాగేశ్వరరావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment